నమస్తే తెలంగాణ కథనం ప్రకారం, ఆసియా క్రీడల టీ20 క్రికెట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు సెమీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో భారత్ 124 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా బ్యాటర్లకు సవాల్ విసిరిన పిచ్‌పై వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 80 నాటౌట్) వీరవిహారానికి తోడు వైభవ్ సూర్యవంశీ (21 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38) రాణించడంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 169/7 స్కోరు చేసింది.
ఆసియా క్రీడల టీ20 క్రికెట్‌లో భారత్ ఫైనల్‌కు
ఆసియా క్రీడల టీ20 క్రికెట్‌లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్స్‌లో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో ఓడించింది.
క్రీడలుమూలం: Namasthe Telangana
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



