బ్రిస్బేన్‌లోని సెవెంత్ బ్రిగేడ్ పార్కులో జాగింగ్ చేస్తున్న భారత సంతతికి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అజయ్ మాలిక్ (37)పై రెండు కుక్కలు శుక్రవారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో దాడి చేశాయి.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మాలిక్‌ను రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అజయ్ మాలిక్ ముఖం, రెండు చేతులకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో తమ కుటుంబం షాక్‌కు గురైందని, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని ఆయన భార్య తెలిపారు.
దాడి జరిగిన తర్వాత రెండు కుక్కలు అక్కడి నుంచి పారిపోయాయి. వాటిని పట్టుకోవడానికి అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై బ్రిస్బేన్ సిటీ కౌన్సిల్ స్పందించింది. దాడికి గురైన బాధితుడికి తమ ప్రార్థనలు ఉన్నాయని కౌన్సిల్ పేర్కొంది.



