దసరా పండుగ సందర్భంగా సోమవారం పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతను ప్రారంభించారు. తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో 4.5 లక్షల గృహాలను ఆమోదించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తెలంగాణలో ఇప్పటికే సుమారు 2.4 లక్షల ఇందిరమ్మ గృహాల నిర్మాణం పూర్తయిందని మంత్రి వివరించారు. ఇందిరమ్మ టవర్ల నిర్మాణం ప్రారంభమైన క్యూఆర్ఈ ప్రాంతంలో లక్ష ఇళ్లను నిర్మించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాల్లోని అర్హులైన పేద కుటుంబాలకు దశలవారీగా ఇళ్లను కేటాయిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రభుత్వం మూడో, నాలుగో విడతల్లో కూడా ఇళ్లను మంజూరు చేస్తుందని పొంగులేటి హామీ ఇచ్చారు.



