పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలోని తన క్యాంపు ఆఫీస్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉద్ధండాపూర్‌కు 16 టీఎంసీలకు చుక్క నీరు తగ్గినా బరాబర్‌ కొట్లాడుతామని అనిరుధ్‌రెడ్డి స్పష్టం చేశారు. నీటి దోపిడీ చేస్తే చూస్తూ ఊరుకోలేనని ఆయన అన్నారు.

పీఆర్‌ఎల్‌ఐ పథకంలో భాగంగా నిర్మించిన ఏదుల రిజర్వాయర్‌ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించడాన్ని తాము అంగీకరించబోమని ఎమ్మెల్యే తేల్చిచెప్పారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన రాజకీయ గురువు అని, ఆయన కోసం తలనైనా నరుక్కుంటానని అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే, తమ కడుపు కొడుతానంటే తలవంచనని ఆయన అన్నారు.