2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అరుదైన విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఫలితాలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. వంద శాతం విజయంతో జనసేన రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది.
ఈ విజయం పార్టీ పునాదులను ఎంత బలంగా నిలబెట్టిందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఎమ్మెల్యేలు పార్టీని బలోపేతం చేస్తున్నారా, లేక 2024 విజయం కూటమి రాజకీయాల ఫలితమేనా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ అరుదైన రికార్డు భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.



