జాన్వీ కపూర్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. ఈ చిత్రం గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో సిద్ధార్థ్ గుప్తా హీరోగా నటిస్తున్నారు. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని పిచ్చిగా ప్రేమించే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.

హిందీ, తెలుగు సినీ పరిశ్రమల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, శ్రీలీల తొలిసారిగా ఒకే తెరపై కనిపించబోతున్నారు.

ఈ భారీ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌కు ఇంకా అధికారికంగా టైటిల్ నిర్ణయించలేదు.