సుదర్శనం ప్రొడక్షన్స్‌ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం ‘జయహో రామానుజ’. డా॥ సాయివెంకట్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రంలో జోశర్మ, సుమన్‌, ప్రవళ్లిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘జయహో రామానుజ’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకురానుంది.