అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఎస్‌వీజీఎం డిగ్రీ కళాశాలలో పంచాయతీ ఎన్నికల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో పర్యవేక్షణలో ఈ శిక్షణ జరిగింది.

ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులకు వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని వారికి సూచించారు.

ఈ శిక్షణలో ఎంసీసీ, ఎంఓటీ, రూట్ అధికారులు, జోనల్ అధికారులకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాలు, బాధ్యతలపై అవగాహన కల్పించారు.

తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. ఆర్డీవో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.