తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామని రైతులు ఇప్పుడు భావిస్తున్నారని కరీంనగర్‌కు చెందిన బాల నారాయణ అనే రైతు శుక్రవారం ఒక డిబేట్లో ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
సాగునీరు, విద్యుత్ సరఫరా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆయన విమర్శించారు. కరువు పరిస్థితులకు ఎల్ నినోను కారణంగా చూపుతూ ప్రభుత్వం తమ అసమర్థతను కప్పిపుచ్చుకుంటోందని నారాయణ అన్నారు.
కరోనా సమయంలోనూ మునుపటి ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం కరువులో రైతులను ఆదుకోవడంలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ రైతాంగం తీవ్ర ఆగ్రహంతో ఉందని నారాయణ తెలిపారు. ప్రతి రైతు కుటుంబం ఇప్పుడు తమ నిర్ణయంపై పునరాలోచనలో పడిందని ఆయన అన్నారు.
కాంగ్రెస్‌కు ఓటు వేసి తప్పు చేశామని, ఈ విషయంలో కేసీఆర్ అందరినీ క్షమించాలని ఆయన లైవ్‌లోనే విజ్ఞప్తి చేశారు.



