తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. తన సోదరుడు కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
నమ్మిన వారిని నట్టేట ముంచడం కేటీఆర్ నైజమని కవిత ఆరోపించారు. సొంత మనుషులపై మరిగే నీళ్లు పోయడం కేటీఆర్ నైజమని ఆమె వ్యాఖ్యానించారు.
కేటీఆర్ స్వార్థ రాజకీయాల కోసం నమ్ముకున్న వారిని మోసం చేస్తారని కవిత పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో ఆదుకున్న ప్రతిమా శ్రీనివాసరావుపై కేటీఆర్ లేఖ రాశారని కవిత గుర్తు చేశారు. ఈ విషయంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.



