హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద చేపట్టిన భారీ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. పర్యావరణవేత్తలు, వివిధ ప్రజా సంఘాలు కోర్టులను ఆశ్రయించడంతో ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 2,500 పచ్చని చెట్లను నరికివేశారు. పనులు ప్రారంభించి, కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన తర్వాత ఈ పరిస్థితి తలెత్తింది.

ప్రజా పాలన రేవంత్ ప్రభుత్వం పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తున్నదని అందరూ అంటున్నారని, ఈ కేబీఆర్ పార్క్ ప్రాజెక్టు అందుకు ఉత్తమ ఉదాహరణ అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ఒక పాలనా దక్షత వున్న వ్యక్తి అయితే ఇలాంటి విషయాలను ముందే అంచనా వేసి, సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉండేది.

ఈ ప్రాజెక్టు నిలిచిపోవడం వల్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా, పర్యావరణానికి జరిగిన నష్టంపై కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టే ముందు ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.