తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు వేడుకలైన సద్దుల బతుకమ్మ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం తెలంగాణ ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.

తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా జరిగాయని ఆయన పేర్కొన్నారు.

తమ జీవితాలు బాగుండాలని కోరుకుంటూ బతుకమ్మకు వీడ్కోలు పలుకుతూ ఆడబిడ్డలు ఈ సాంస్కృతిక వేడుకలను ముగిస్తారని కేసీఆర్ వివరించారు.

రాష్ట్ర సాధనలో, తెలంగాణ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఎంతో గొప్పదని ఆయన గుర్తు చేశారు. వారి కృషిని త్యాగాలను గుర్తించి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిందని చెప్పారు.

ఆడబిడ్డలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ, వారి సంక్షేమం కోసం నిజాయితీగా కృషి చేయడం ద్వారానే బతుకమ్మ పండుగ స్ఫూర్తిని కొనసాగించగలమని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.