తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బల్మూరి వెంకట్ గాలి మాటలు మాట్లాడుతున్నారని, విప్‌గా ప్రజలకు మంచి పనులు చేయాల్సింది పోయి, ఎంతసేపు విమర్శించడమే సరిపోతుందని ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. బల్మూరి వెంకట్ కాదు ఇచ్ గార్డు వెంకట్ అని కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి వ్యాఖ్యానించారు.
బల్మూరి వెంకట్‌పై కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన ఆరోపణలపై కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలకు మంచి పనులు చేయాల్సింది పోయి, విమర్శించడమే సరిపోతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయాలుమూలం: Namasthe Telangana
ఈ బ్రౌజర్లో వినడం అందుబాటులో లేదు



