కమ్యూనిస్టులు చీలిపోవడం వల్లనే ఎన్నికల్లో గెలవడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టు జండాలు ఏకమైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విడివిడిగా ఉండి ఎన్నికల్లో గెలుస్తామంటే కుదరదని కూనంనేని స్పష్టం చేశారు.

కమ్యూనిస్టులు అంతా కలిసి పని చేస్తేనే గెలుపు సాధ్యమని కూనంనేని అన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కమ్యూనిస్టు పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.