జిల్లా బాలల సంక్షేమ, జువైనల్ జస్టిస్ బోర్డు చైర్మన్, సభ్యుల పోస్టుల నియామకాలకు సంబంధించిన ఇంటర్వ్యూ ప్రక్రియ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. నాలుగున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నియామకాలు చేపడుతున్నారు.
ఈ పోస్టులకు భారీ డిమాండ్ ఉంది. ఇంటర్వ్యూలకు ఎంపికైన కొందరు అభ్యర్థులు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు.
ఈ ప్రజాప్రతినిధుల ద్వారా సంబంధిత శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇంటర్వ్యూ తేదీలు ఖరారైనప్పటి నుంచి అభ్యర్థులు సెక్రటేరియట్, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
అభ్యర్థులు ఈ పోస్టులను దక్కించుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ నియామక ప్రక్రియలో పారదర్శకతపై ఆసక్తి నెలకొంది.



