స్థానిక ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. మున్సిపల్ పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. కూటమి, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా రాజకీయం మారుతోంది. ఏకపక్షంగా విజయం సాధించాలని కూటమి ప్రయత్నిస్తోంది. జగన్ ఇలాకాలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఈ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది రిటర్న్ గిఫ్ట్ గేమ్ ప్రారంభమైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ స్థానిక ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కూటమి, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో, ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే పెద్ద ఎన్నికలకు దిశానిర్దేశం చేయగలవు.



