తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సాయంత్రం, శనివారం శ్రీ మలయప్ప స్వామి గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ వాహన సేవను సాంప్రదాయ వాయిద్యాల నడుమ వైభవంగా నిర్వహించారు. ఊరేగింపునకు ముందు గంభీరమైన ఏనుగులు నడిచాయి.

భజన బృందాలు, కోలాటాలతో పాటు జీయంగార్ల పారాయణం భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు ఊరేగింపు మార్గంలో కర్పూర హారతులు సమర్పించి, శ్రీ వేంకటేశ్వరుని ఆశీస్సులు పొందారు.

గజ వాహనం వైభవం, రాజసం, సంపదలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. పాల్గొన్నారు.