హీరో మంచు మనోజ్ తన తదుపరి చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తెలంగాణ పండగ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది.

ఈ బిగ్ బడ్జెట్ చిత్రాన్ని 'డివైన్ యాక్షన్ థ్రిల్లర్'గా రూపొందిస్తున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.

ఆర్పీఏ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇది ఆ సంస్థకు ప్రొడక్షన్ నంబర్ 5.

'ప్రేమకథా చిత్రం', 'జక్కన్న' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్.పీ.అక్షిత్ రెడ్డి, ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు.