హైదరాబాద్‌కు చెందిన మనీషా భారత పురాణాలు, ఇతివృత్తాలను తెలిపేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన మన సంస్కృతి, సంప్రదాయాల ప్రత్యేకతను చాటి చెబుతోంది.

1991లో చిన్న చిన్న కథలతో ఆమె ఈ బొమ్మల కొలువును మొదలుపెట్టారు. అప్పటి నుండి ఆమె ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం ఈ బొమ్మల కొలువు పురాణ గాథల వరకు విస్తరించింది. వివిధ పురాణాలలోని ముఖ్య ఘట్టాలను బొమ్మల రూపంలో ప్రదర్శిస్తున్నారు.

ఈ ప్రదర్శన ద్వారా నేటి యువతకు పురాణ గాథల పట్ల అవగాహన కల్పించాలనే లక్ష్యంతో మనీషా కృషి చేస్తున్నారు.