ఉమ్మడి విశాఖపట్నం జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్న మాతా గురునాథరావు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనకాపల్లిలోని క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు.

గురునాథరావుతో పాటు ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీకి చెందిన 30 కుటుంబాలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరినట్లు హోంమంత్రి అనిత తెలిపారు.

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, పార్టీలోకి చేరిన వారికి పసుపు కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఉపమాక పంచాయతీ సారిపల్లిపాలెం గ్రామానికి చెందిన జోగా అప్పారావు, మామిడి చంద్రయ్యలు కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరి చేరికతో పార్టీకి మరింత బలం చేకూరిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.