మెల్బోర్న్ నగరంలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అక్టోబర్ 19, 2026న అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆరు వేల మందికి పైగా తెలంగాణ బిడ్డలు పాల్గొన్నారు.
పూలతో గౌరమ్మను పేర్చి, ఆడబిడ్డలంతా కలిసి ఆటపాటలతో తెలంగాణ సంస్కృతిని ఆస్ట్రేలియా గడ్డపై చాటిచెప్పారు. ఈ కార్యక్రమం తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది.
ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ గత 13 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది మెల్బోర్న్లో జరిగిన వేడుకలు మరింత ప్రత్యేకంగా నిలిచాయి.
ఆస్ట్రేలియా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుడు అనిల్ బైరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్ట్రేలియా గడ్డపై తెలంగాణ సంప్రదాయాన్ని, బతుకమ్మ సంస్కృతిని 13 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.



