రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా నిశ్శబ్ద విప్లవం కొనసాగుతోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్రజామద్దతు దేశంలో రాజకీయ మార్పునకు సంకేతమని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ, ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు చూస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతోందని ఆయన అన్నారు.

చార్మినార్‌ వద్ద సోమవారం రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర స్మారక దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షత వహించారు.

రాజీవ్‌ సద్భావన పురస్కార ప్రదానోత్సవం కూడా ఈ సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.