జేఎన్‌టీయూ వైస్‌ చాన్స్‌లర్‌ కిషన్‌కుమార్‌రెడ్డి భార్య సుజనారెడ్డి తనపై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. గత నెల 8న ఆమెను పోలీస్‌స్టేషన్‌లో దూషించి, బెదిరించినట్టు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని, ఎన్నడూ చూడలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తాను వీసీకి ఫోన్‌ చేసిన సమయంలో ఆయన బాత్‌రూమ్‌లో ఉన్నారని వేరొకరు చెప్పగా, వీసీతోనే మాట్లాడుతానని చెప్పి కాల్‌ కట్‌ చేశానని తెలిపారు.

ఆ తర్వాత ఆయనతో నేరుగా మాట్లాడి, యూనివర్సిటీకి చెందిన సీనియర్‌ ప్రొఫెసర్లను, ప్రత్యేకించి మహిళా అధ్యాపకులను అసభ్యంగా దూషించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశానని స్పష్టతనిచ్చారు.

తనపై వ్యతిరేకత ఉంటే నేరుగా తననే ప్రశ్నించవచ్చని, మహిళా ప్రొఫెసర్లను కించపరచడం తగదని హెచ్చరించినట్లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంపై వీసీ తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు చెప్పారని ఆయన పేరొన్నారు.

ఈ ఘటన విశ్వవిద్యాలయ పరిపాలనలో పారదర్శకత, గౌరవం ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. ఉన్నత విద్యాసంస్థల్లో ఇటువంటి వివాదాలు విద్యార్థులు, అధ్యాపకుల మధ్య విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.