రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 17న నందివాడలోని ప్రజావేదిక కార్యాలయంలో నందివాడ మండల టీడీపీ, కూటమి నేతలతో ఆయన ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాలుగు గోడల మధ్య కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తలు, స్థానిక నాయకత్వం అభిప్రాయాలకే పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపునకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 90 శాతం గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టామని వెనిగండ్ల రాము గుర్తుచేశారు. వరదల సమయంలో కూటమి కార్యకర్తలు అందించిన సేవలను ప్రజలు గుర్తించారని ఆయన పేర్కొన్నారు.
చిన్నపాటి అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి, కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని సూచించారు.



