ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

ఎమ్మెల్యే రాగమయి, ఎంపీ రఘురామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు తెలియజేయాలని నాయకులకు సూచించారు. ఈ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ పట్టణాల్లో, గ్రామాల్లో, వార్డుల్లో అర్హులైన అందరినీ ఎన్నికల కోసం ఓటర్ ఆన్‌లైన్ చేయించాలని కాంగ్రెస్ శ్రేణులకు తెలియజేశారు.