కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని కేసీఆర్ తన ఫామ్ హౌజ్‌కు మళ్లించుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
తన ఫామ్ హౌజ్‌కు నీటి అవసరాల కోసమే కేసీఆర్ వేల కోట్ల రూపాయలతో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును నిర్మించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
కేసీఆర్ ఫామ్ హౌజ్ సమీపంలో 58 ఎకరాల విస్తీర్ణంలో పాండురంగ చెరువును తవ్వించారని, 2016కు ముందు ఆ ప్రాంతంలో అలాంటి చెరువు లేదని ఆయన వివరించారు.
2017లో ఈ చెరువు నిర్మాణం పూర్తయిన తర్వాత కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని మళ్లించి నింపుతున్నారని ఎంపీ చామల తెలిపారు.
పాండురంగ చెరువు నుంచి ప్రత్యేక పైప్‌లైన్ల ద్వారా కేసీఆర్ ఫామ్ హౌజ్‌లోని మూడు ఎకరాల బావికి నీటిని పంప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నీటి మళ్లింపు వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ చామల డిమాండ్ చేశారు.



