పాలస-కాశీబుగ్గ మున్సిపాలిటీకి సంబంధించి శనివారం 63 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల అధికారి ఇ.శ్రీనివాసులు ఈ వివరాలను తెలిపారు.

ఈ నామినేషన్లలో టీడీపీ అభ్యర్థులు 18, వైసీపీ అభ్యర్థులు 41, జనసేన అభ్యర్థులు 3, ఇతరులు 1 నామినేషన్ వేశారు. వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి తాలాస్ శ్రీపద్మ కూడా నామినేషన్ దాఖలు చేశారు.

నామినేషన్ల కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండో రోజు మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది.

ఇచ్చాపురం మున్సిపాలిటీలో కూడా నామినేషన్ల ప్రక్రియ వేగవంతమైంది. శనివారం ఒక్కరోజే 31 నామినేషన్లు దాఖలయ్యాయి.