టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన మైత్రీ మూవీ మేకర్స్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశించిన అతి తక్కువ సమయంలోనే పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్‌ఎల్‌పి’ చూపుతున్న దూకుడు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

పండుగ సీజన్లలో భారీ చిత్రాల మధ్య పోటీ సహజం. అయితే ఈ దసరా బరిలో నిలిచిన ప్రధాన చిత్రాలన్నింటినీ తమ ఖాతాలోనే వేసుకుంటూ మైత్రీ సంస్థ నైజాం మార్కెట్‌ను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది.

వరుసగా విడుదలవుతున్న బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్‌లన్నీ ఒకే డిస్ట్రిబ్యూటర్ చేతుల మీదుగా రావడం నైజాం సినీ పంపిణీ చరిత్రలోనే అత్యంత అరుదైన మైలురాయిగా నిలిచింది.

ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న మూడు క్రేజీ చిత్రాలు మైత్రీ సంస్థ పర్యవేక్షణలోనే నైజాంలో స్క్రీన్లపైకి వస్తున్నాయి.

ఈ పరిణామం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని సినీ పంపిణీ రంగంలో మైత్రీ మూవీ మేకర్స్ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది. ఇది భవిష్యత్తులో ఇతర పంపిణీదారులకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.