భారతీయ సినీ పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్, 'మైత్రీ ఇన్ లవ్' పేరుతో ఒక కొత్త ప్రేమకథా చిత్రాన్ని ప్రారంభించింది. ఈ చిత్రం ద్వారా సినీ రంగంలోకి కొత్త ప్రతిభను పరిచయం చేయనుంది.
రవిశంకర్ నేతృత్వంలోని ఈ సంస్థ 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్', 'రంగస్థలం', 'పుష్ప', 'ఇరుముడి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఇప్పటికే తనదైన ముద్ర వేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ టాప్ స్టార్స్‌తో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూనే, బలమైన కథాంశాలతో రూపొందే చిన్న, మీడియం సినిమాలకు కూడా అండగా నిలుస్తూ కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తోంది.
గతంలో జాతీయ అవార్డు అందుకున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'ఉప్పెన'తో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలను జంటగా పరిచయం చేసిన ఈ నిర్మాణ సంస్థ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రేమకథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.
'మైత్రీ ఇన్ లవ్' చిత్రంతో ఎన్నో ఏళ్లుగా సినిమా కలలు కంటూ, తమ ప్రతిభను మెరుగుపరుచుకున్న కొత్తవారు సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు కొత్త తరాన్ని పరిచయం చేయడంలో మైత్రీ మూవీ మేకర్స్ నిబద్ధతను తెలియజేస్తుంది.



