కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని నమస్తే తెలంగాణ పత్రిక తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతామని చెప్పే కాంగ్రెస్, తాము అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం ప్రశ్నించే గొంతుకపై ఉక్కుపాదం మోపుతుందని నమస్తే తెలంగాణ పేర్కొంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ వీధుల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తారని, నినాదాలు చేస్తారని పత్రిక తెలిపింది. అయితే, కాంగ్రెస్ ప్రమాణాలు ఢిల్లీకి, గల్లీకి జమీన్ ఆస్మాన్ పరఖ్ అన్నట్టుగా మారుతుంటాయని నమస్తే తెలంగాణ అభిప్రాయపడింది.