కుర్ర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్న ‘డెస్టినీ’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకురాలు నందినీ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. చెందు ముద్దు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో జబర్దస్త్ ఇమాన్యుయేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

‘డెస్టినీ’ టైటిల్‌కు తగ్గట్టుగా పోస్టర్ డిజైన్ ఉందని చిత్ర బృందం తెలిపింది. సినిమా నిర్మాణం వేగంగా జరుగుతోంది.