ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెప్పిందంటే చేసి తీరుతుందని టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశానికి 26 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక వాతావరణాన్ని సిద్ధం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. ఇది ప్రజారంజక పాలన అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో ప్రజారంజక పాలన అందిస్తున్నామని, అందుకే కూటమికి ఓట్లేయాలని ధైర్యంగా అడగటానికి కూటమి ప్రభుత్వం ముందుకు వస్తోందని రామయ్య అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల అభ్యున్నతి కోసం 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న బలమైన సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వస్తోందని ఆయన తెలిపారు.