భారత పురుషుల సీనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్ బాధ్యతలను ప్రజ్ఞాన్ ఓజా స్వీకరించాడు. బెంగళూరులో ఈ నియామకం జరిగింది.
గతంలో ఈ పదవిలో ఉన్న అజిత్ అగార్కర్ ఈ నెల 4న తన పదవీకాలం ముగియగానే రాజీనామా చేశాడు. అగార్కర్ రాజీనామా తర్వాత ఓజా తాత్కాలిక చీఫ్ సెలక్టర్‌గా పనిచేశాడు.
ఓజా తన సీనియారిటీ ఆధారంగా పూర్తిస్థాయి బాధ్యతలను అందుకున్నాడు. ఆయన అక్టోబర్ 20, 2026 వరకు ఈ పదవిలో కొనసాగుతాడు.
అగార్కర్ ప్రాతినిధ్యం వహించిన వెస్ట్ జోన్ స్థానంలో మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్ సెలక్టర్‌గా ఎంపికయ్యాడు. పొవార్ నియామకంతో సెలక్షన్ కమిటీ ఇప్పుడు పూర్తిస్థాయిలో ఉంది.



