సిద్దిపేట పోలీసు కమిషనరేట్‌లో మంగళవారం సీపీ రష్మి పెరుమాళ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పోలీసు సిబ్బంది సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలిపారు.
పోలీసు కమిషనరేట్‌తో పాటు సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు మౌలిక సదుపాయాలను ఆమె ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి పనులకు భూమిపూజ కూడా నిర్వహించారు.
మొత్తం ఏడు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా చేపట్టారు. కమిషనరేట్ ఆవరణలో రాత్రివేళల్లో భద్రతను పెంపొందించేందుకు, మెరుగైన వెలుతురు కోసం నూతన వీధి దీపాలను సీపీ ప్రారంభించారు.
సీపీ కార్యాలయ ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన సమావేశ మందిరాన్ని కూడా ఆమె ప్రారంభించారు. ఈ సమావేశ మందిరం సమీక్షా సమావేశాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీపీ రష్మి పెరుమాళ్ పేర్కొన్నారు.



