రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి కావస్తున్నా, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
గత ఏడాది దసరా నుంచి మంత్రివర్గ విస్తరణపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయని, అయితే అది ఇప్పుడప్పుడే ఉండదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
మంత్రి పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఢిల్లీకి, హైదరాబాద్కు పదేపదే తిరుగుతూ విసిగిపోయారు.
తొలుత కేరళ, బెంగాల్ ఎన్నికల తర్వాత విస్తరణ ఉంటుందని చెప్పినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు.
ప్రస్తుతానికి మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.



