దసరా వేడుకల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్ కప్ పేరుతో జరిగిన 73వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో పల్నాడు పురుషుల జట్టు, శ్రీకాకుళం మహిళల జట్టు టైటిళ్లు గెలుచుకున్నాయి. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎంబీపీ స్టేడియంలో అక్టోబర్ 17 నుంచి 19 వరకు ఈ పోటీలు జరిగాయి.

సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో 25 చొప్పున జిల్లా జట్లు పాల్గొన్నాయి. ఎనిమిది పూల్స్‌గా లీగ్, ఆ తర్వాత నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరిగాయి.

ఫలితాలు

  • పురుషుల ఫైనల్: పల్నాడు 35-29తో విశాఖపట్నంపై గెలుపు
  • మహిళల ఫైనల్: శ్రీకాకుళం 28-9తో ఎన్టీఆర్ జిల్లాపై గెలుపు
  • పురుషుల సెమీస్: పల్నాడు 25-10తో మార్కాపురంపై, విశాఖపట్నం 42-41తో బాపట్లపై
  • మహిళల సెమీస్: శ్రీకాకుళం 23-22తో చిత్తూరుపై, ఎన్టీఆర్ 45-26తో బాపట్లపై

పురుషుల విభాగంలో బాపట్ల, మార్కాపురం, మహిళల విభాగంలో బాపట్ల, చిత్తూరు జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. విజేత పల్నాడు జట్టుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ట్రోఫీ అందజేశారు.