పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ లో ఏసీపీ గజ్జి కృష్ణ దసరా వేడుకల ఏర్పాట్లపై కుల సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఎస్సై గట్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

విజయదశమి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ గజ్జి కృష్ణ ఈ సందర్భంగా సూచించారు. గతంలో జరిగిన చిన్నచిన్న మనస్పర్థలు, అభిప్రాయ భేదాలు లేకుండా ఈసారి వేడుకలు జరుపుకోవాలని కోరారు.

గత కొన్ని సంవత్సరాల క్రితం దసరా ఉత్సవాలు సజావుగా జరగని పరిస్థితులు ఉండేవని ఏసీపీ గుర్తు చేశారు. అయితే 2024 నుంచి గ్రామ పెద్దలు, యువత సహకారంతో కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా దసరా జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు.

ఈసారి దసరా పండుగను గతంలో కంటే మరింత బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి పోలీసు శాఖ తరఫున 100 శాతం హామీ ఇస్తున్నట్లు ఏసీపీ గజ్జి కృష్ణ పేర్కొన్నారు.