విశాఖపట్నం మధురవాడ 8వ వార్డు వైకాపా కార్పొరేటర్ అభ్యర్థిగా పిల్లా అనిత పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించింది.

వార్డులో మంచినీటి సమస్యను పరిష్కరించి, అభివృద్ధి చేస్తానని పిల్లా అనిత తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.

పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు మాట్లాడుతూ, 8వ వార్డు నుంచి కార్పొరేటర్ సీటు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. వార్డు అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గెలిచిన తర్వాత వార్డులో అభివృద్ధి పనులు చేపడతానని పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.