ముత్తుకూరు, అక్టోబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కృష్ణపట్నం సర్పంచ్ స్థానం బీసీలకు కేటాయించబడింది. ఈ సందర్భంగా, ఆ గ్రామానికి చెందిన మత్స్యకార సంఘం నాయకులు బి. పోలయ్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామని ప్రకటించారు. మత్స్యకార గ్రామాల్లో బీసీ ఓటు బ్యాంకు బలమైన శక్తిగా ఉందని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ స్థానంతో పాటు కొన్ని వార్డులకు కూడా పోటీ చేస్తామని పోలయ్య తెలిపారు.