తెలంగాణ రాష్ట్రంలో రైతులు విద్యుత్ కోతలతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంటలకు నీరందించలేక, వాటిని కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో, బీఆర్‌ఎస్‌ నాయకులు రైతులకు అండగా నిలుస్తున్నారు. అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు చేపడుతున్నారు, సబ్‌స్టేషన్లను ముట్టడిస్తున్నారు.