మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని పాకాల ఏటి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ముఖ్యమంత్రి సలహాదారుడు, రాజ్యసభ సభ్యులు వేమ్ నరేందర్ రెడ్డి మేనల్లుడు మైనంపాటి ప్రవీణ్ రెడ్డి పరిశీలించారు.
ఈ పనుల పురోగతిని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను పాటించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్, సీపీఐ నాయకులు ప్రవీణ్ రెడ్డికి ఘనస్వాగతం పలికారు. స్థానిక సమస్యలపై ఆయనతో చర్చించారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానికులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ప్రవీణ్ రెడ్డి అన్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.



