పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. నామినేషన్ వేసేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్‌ గ్యాస్‌ కూడా ప్రయోగించారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

టీడీపీ గూండాల చేతుల్లో కర్రలు, రాడ్లు, వేటకొడవళ్లు, పెట్రోల్‌ ఉన్నాయని వైఎస్సార్‌సీపీ నేత, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి అన్నారు. టీడీపీ గూండాలను వదిలేసి తమ పార్టీ కౌన్సిలర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారని ఆయన తెలిపారు. ఎన్నికల కమిషన్ తక్షణమే ఈ ఘటనపై దృష్టి సారించాలని అవినాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.