అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల దాఖలు సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎంపీ మిథున్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదయ్యాయి.

పుంగనూరు పోలీస్ స్టేషన్‌లో ఎంపీ మిథున్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులలో ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరో 50 మందిని చేర్చారు.

కేసులు నమోదైన వారిలో మాజీ ఎంపీ రెడ్డప్ప, సుధీర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, వంశీ, సహదేవ్ కూడా ఉన్నారు.

కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోందని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించాయి.