పీవీ సింధు ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో ప్రపంచ 22వ ర్యాంకర్, జపాన్‌కు చెందిన హీనా అకెచిని 21-10, 20-22, 21-16 తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ గంటా 13 నిమిషాలు సాగింది.
సెమీస్ ఎలా సాగింది?
తొలి గేమ్‌ను సింధు 21-10తో సునాయాసంగా గెలుచుకుంది. రెండో గేమ్‌ను హోరాహోరీ పోరులో 20-22తో కోల్పోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ను 21-16తో గెలిచి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. 21 ఏళ్ల అకెచి ఈ టోర్నీలో అంతకుముందు వాంగ్ ఝీ యీ, పుత్రి కుసుమ వార్దానిలను ఓడించింది.
ఫైనల్‌లో కఠిన సవాల్
ఫైనల్‌లో సింధు కొరియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ఆన్ సె యంగ్‌తో తలపడనుంది. "మేమిద్దరం చాలాసార్లు ఆడాం. ఆమె చాలా బాగా ఆడుతోంది" అని సింధు చెప్పింది. "పని ఇంకా పూర్తి కాలేదు" అని అన్నది.
కోచ్ ఇర్వాన్‌స్యా ఆది ప్రతమ, స్పోర్ట్స్ సైంటిస్ట్ వేన్ లోంబార్డ్ సింధు సహాయ బృందంలో ఉన్నారు.




