తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలను ఈ ఏడాది మిస్ అవుతున్నానని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. గత ఏడాది తాను సంబరాల్లో పాల్గొన్న ఫోటోలను కూడా ఆమె పంచుకున్నారు.
ఈ ఫోటోలలో వెండి బతుకమ్మను పట్టుకుని ఉన్న సింధుపై ఒక నెటిజన్ విమర్శలు చేశారు. ‘పూలు పేర్చితే బతుకమ్మ అంటారు, మీ పైత్యాన్ని పండుగపై రుద్దకండి’ అంటూ ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై ఒలింపిక్ విజేత పీవీ సింధు తనదైన శైలిలో స్పందించారు. నెటిజన్ చేసిన విమర్శలకు ఆమె దీటైన జవాబిచ్చారు.
ఏదైనా అభిప్రాయానికి వచ్చే ముందు ఈ సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలని సింధు హితవు పలికారు. ఆమె ఇచ్చిన సమాధానం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.



