దిల్లీలోని తన అధికారిక నివాసంలో రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన 'హై-టీ' సమావేశంలో పోలీసుల దాడికి గురైన ఎన్‌ఎస్యూఐ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమపై జరిగిన దాడిని రాహుల్ గాంధీకి వివరించారు.

ఈ సమావేశంలో ఇండియా ఐక్యసంఘటనా నాయకులతో పాటు సీఈసీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంటున్న సివిల్ సొసైటీ కార్యకర్తలు, యువజన, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. పోలీసుల చేతిలో గాయాలైన ఎన్‌ఎస్యూఐ విద్యార్థులు ప్రత్యేకంగా రాహుల్ గాంధీని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

తమను పోలీసులు రోడ్లపై ఈడ్చెకళ్లారని, ఇష్టారీతిన కొట్టారని ఆందోళనకారులు రాహుల్ గాంధీతో వాపోయారు. ఈ ఘటనల పట్ల రాహుల్ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు దాడి చేసిన వీడియో ఆధారాలు సేకరించాలని, బాధ్యులకు తగిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని రాహుల్ గాంధీ వారికి హామీ ఇచ్చారు. కేరళంకు చెందిన అతిర అనే విద్యార్థిని ఒక చెవి వినికిడి కోల్పోయిందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ ఘటనలు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అణచివేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను సూచిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వెళ్ళిన విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ హామీ వారికి భరోసా కల్పిస్తుంది.