నితీశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా పౌరాణిక చిత్రం ‘రామాయణ’ వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ నెల 27న సాయంత్రం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో ఈ సినిమా ప్రీమియర్ జరగనుంది.
లాస్ ఎంజెల్స్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఉన్న డేవిడ్ గెఫెన్ థియేటర్‌లో ఈ ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తారు.
ఈ ప్రీమియర్‌కు హాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు హాజరుకానున్నారు. పలువురు ప్రపంచ సినీ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొంటారు.
దాదాపు మూడువేల కోట్ల నిర్మాణ వ్యయంతో నమిత్ మల్హోత్రా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. రణబీర్‌కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్నారు.
ఈ ఫ్రాంచైజీలోని తొలి భాగం దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.



