రంజీ ట్రోఫీ ఎలైట్ మూడో రౌండ్ సోమవారం నుంచి గురువారం (అక్టోబర్ 26–29) వరకు జరుగుతుంది. మ్యాచ్‌లు ఉదయం 9:30కి మొదలవుతాయి.
హైదరాబాద్ vs పంజాబ్
- వేదిక: జింఖానా మైదానం, హైదరాబాద్. ఫలితం వచ్చే పిచ్ కావాలనే ఈ మైదానాన్ని ఎంచుకున్నారు
- పాయింట్లు: రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు 13, పంజాబ్‌కు 9
- హైదరాబాద్ కెప్టెన్: చామా మిలింద్
- హైదరాబాద్ జట్టులో మహ్మద్ సిరాజ్, పంజాబ్ జట్టులో శుభ్‌మన్ గిల్ లేరు
తొలి రెండు మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసిన స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్, గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన కె. హిమతేజపై హైదరాబాద్ ఆశలు పెట్టుకుంది. పంజాబ్ బౌలింగ్‌లో ఈ సీజన్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ఉమేశ్ యాదవ్, హర్‌ప్రీత్ బ్రార్ కీలకం.
ఆంధ్ర vs ఛత్తీస్‌గఢ్
బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ మ్యాచ్ ములపాడులోని డీవీఆర్ మైదానంలో జరుగుతుంది. తుపాను కారణంగా బుధవారం (మ్యాచ్ మూడో రోజు) ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది.




