ఆంధ్రప్రదేశ్ లోని రావులపాలెం మండలం వ్యాపార, వాణిజ్య, రాజకీయ రంగాలలో ఎంతో గుర్తింపు పొందింది. అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా కూడా పేరు గాంచింది. అయితే, మండల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ మండలం అచ్చిరాని మండలంగా ముద్ర పడిపోయింది. రావులపాలెం ఎంపీపీ పదవి అంటే 'అమ్మ బాబోయ్' అనే పరిస్థితి ఏర్పడింది.
మండల వ్యవస్థ మొట్టమొదటి నుంచి ఎంపీపీ పదవి ఎవర్ని వరించినా, వారికి ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ అచ్చిరాని ముద్ర కారణంగా, ఈ పదవిని చేపట్టడానికి చాలా మంది వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పటి వరకు కొనసాగుతుందో చూడాలి.



