కరీంనగర్ జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంతో పాటు ఆయా డివిజన్లలో, గ్రామాలలో, మండల కేంద్రాలలో ఈ వేడుకలను నిర్వహించారు.

వివిధ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, అధికారులు ఈ పండుగలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చేందుకు ఆడపడుచులు సిద్ధమయ్యారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగలో చివరి రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు.

ఈ రోజున మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. సాయంత్రం బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు.